బోధనా చెల్లింపుల పేరు మార్చారు: గోరంట్ల
close

తాజా వార్తలు

Published : 19/04/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోధనా చెల్లింపుల పేరు మార్చారు: గోరంట్ల

అమరావతి: ఎన్నో ఏళ్లుగా సాగుతున్న బోధనా రుసుముల చెల్లింపు పథకానికి పేరు మార్చడంతో పాటు.. సకాలంలో చెల్లింపులు చేయడం లేదని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది.. బోధనా రుసుములు చెల్లించేది ఎంతమందికో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నరేగా, ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర స్థాయి విచారణ జరపాలని బుచ్చయ్య చౌదరి కోరారు. ‘‘ సీఎఫ్‌ఎంఎస్‌ పేరుతో పంచాయతీరాజ్‌ను నిర్వీర్యం చేశారు. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ను కుటుంబంలో ఒకరికే ఇస్తూ లబ్ధిదారులను గణనీయంగా తగ్గించేశారు. కేంద్ర బడ్జెట్‌ నుంచి విద్యాశాఖకు వచ్చే పథకాలకు పేర్లు మారుస్తున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని