ఆయన ప్రధాని.. ఏదైనా మాట్లాడొచ్చు: తేజస్వి
close

తాజా వార్తలు

Updated : 30/10/2020 05:20 IST

ఆయన ప్రధాని.. ఏదైనా మాట్లాడొచ్చు: తేజస్వి

పట్నా: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన ‘జంగిల్‌ రాజ్‌ కా యువరాజ్’ వ్యాఖ్యలపై మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ స్పందించారు. అవినీతి, నిరుద్యోగం, వలస కార్మికుల సంక్షోభం వంటి అసలైన సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోకుండా.. అనవసరమైన వ్యాఖ్యలు చేశారని కౌంటర్‌ ఇచ్చారు. గురువారం తేజస్వీ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మోదీ దేశానికి ప్రధానమంత్రి. ఆయన ఏమైనా మాట్లాడొచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించదలచుకోలేదు. కానీ ఆయన నిన్న బిహార్‌కు వచ్చి నిరుద్యోగం, పేదరికం, అవినీతి వంటి కీలక సమస్యలపై మాట్లాడలేదు. భాజపా అతిపెద్ద పార్టీ.. ప్రచారం కోసం వారు 30 హెలికాప్టర్లు ఉపయోగిస్తారు.. ఇలాంటి అనవసర విషయాలు మాత్రమే ప్రస్తావించారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రజలకు మాత్రం అన్నీ తెలుసు. పేదరికం, పరిశ్రమలు, రైతులు, నిరుద్యోగం వంటి అంశాలను మోదీ మాట్లాడాలి’’ అని తేజస్వీ పేర్కొన్నారు.

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ముజఫర్‌పూర్‌ ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. మహాకూటమి సీఎం అభ్యర్థి, అర్జేడీ నేత తేజస్వీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘గతంలో ఆర్జేడీ హయాంలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారింది. కాబట్టి బిహార్‌ ప్రజలు ‘జంగల్‌ రాజ్ ‌కా యువరాజ్‌’పై ఎలాంటి అంచనాలు పెట్టుకోరు’ అని విమర్శలు చేశారు. కాగా బిహార్‌లో బుధవారం తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడత ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని