close

తాజా వార్తలు

Published : 15/01/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. వ్యాక్సినేషన్‌.. ఈ రూల్స్‌ మర్చిపోవద్దు

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించే నియమ నిబంధనలు, చేయాల్సినవి.. చేయకూడనివి చెబుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు రూల్‌బుక్‌ పంపించింది. 18ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని, గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మళ్లీ కొరడా తీసిన ట్రంప్‌..!

మరో ఐదు రోజుల్లో అధికారం అప్పగించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివర్లో చైనాకు షాకుల మీద షాకులిస్తున్నారు.  తన ఓటమికి కారణాల్లో చైనా కూడా ఒకటని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో ఆయన వ్యూహాలు రెండువైపులా పదునున్న కత్తిని తలపిస్తున్నాయి.  పదవి నుంచి దిగే సమయంలో చైనా కంపెనీలను ఆయన లక్ష్యంగా చేసుకొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దాదాగిరీ చేసినందుకు ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులపై నిషేధం విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యూట్యూబర్‌ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్‌

యూట్యూబర్లు తమ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసిన నెటిజన్ల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే వారు ఏది చెప్పినా నెటిజన్లు నిజమని నమ్మే అవకాశాలు ఎక్కువ కాబట్టి. సామాజిక బాధ్యతతో ఏ వీడియోనైనా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని పోస్టు చేయాలి. ఏ కాస్త నిర్లక్ష్యం వహించినా, అది పెద్ద తప్పిదానికి దారితీయొచ్చు. అలాంటి సంఘటనే దక్షిణకొరియాలో ఓ యూట్యూబర్‌ వల్ల జరిగింది. ఒక హోటల్‌పై అతడు ప్రతికూల రివ్యూలు ఇవ్వడంతో అది కాస్తా వైరల్‌గా మారి ఏకంగా హోటల్‌ మూసివేతకు దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 2.03 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు..

భారత్‌లో వైరస్‌ వ్యాప్తి కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నిత్యం దాదాపు 15వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో  దేశవ్యాప్తంగా 7,30,096 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 15,590 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 5 లక్షల 27వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,01,62,738 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 15,975 మంది డిశ్ఛార్జి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహమ్మారిపై భారత్‌ పోరు ప్రశంసనీయం!

5. వాట్సాప్‌ అకౌంట్‌ డిలీట్‌ చేయాలా?

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ దృష్ట్యా చాలా మంది... ఆ యాప్‌ వినియోగాన్ని మానేస్తున్నారు. కొత్త పాలసీని విశ్లేషించిన టెక్‌ నిపుణులు.. యూజర్ల డేటాను వాట్సాప్‌... ఫేస్‌బుక్‌కు అందిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు వాట్సాప్‌ ‘యూజర్ల డేటాను మేం ఎవరికీ ఇవ్వం’ అని కూడా ప్రకటించింది. అయితే వాట్సాప్‌ ఇక సురక్షితం కాదంటూ చాలామంది యాప్‌ను తొలగించేస్తున్నారు. అయితే తొలగించే ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించేయండి... మీ డేటాను తీసుకోండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. సుబ్బయ్య తెదేపా తరఫున పలమనేరు నియోజకవర్గానికి 1985 నుంచి 1999 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా మూడు పర్యాయాలు రాష్ట్ర కేబినెట్‌లో పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సెక్ష‌న్ 80డీ’ తో ప‌న్ను మిన‌హాయింపు ఎలా?

సెక్ష‌న్ 80డీ తో వ్య‌క్తిగ‌త‌, కుటుంబ ఆరోగ్య బీమా పాల‌సీల‌పై చెల్లించే ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ప్ర‌తి ఏడాది మీరు చేసిన పెట్టుబ‌డులు, పొదుపు, జీవిత‌ బీమా ప్రీమియంల‌పై సెక్ష‌న్ 80 సీ కింద‌ ప‌న్ను మిన‌హాయింపు కొర‌కు క్లెయిమ్ చేసుకుంటారు. అయితే సెక్ష‌న్ 80 డీ కూడా ప్ర‌త్యేక ప‌న్ను మిన‌హాయింపుల‌ను అందిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రోడ్డు ప్రమాదంలో 11మంది మృతి

కర్ణాటక రాష్ట్రంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి గ్రామం వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. మరో ఇ ద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుబ్లీలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సలార్‌ షురూ.. ఫొటోలు వైరల్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్‌-యశ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 250 దాటిన ఆస్ట్రేలియా

టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ టిమ్‌పైన్(23*), గ్రీన్‌(20*) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు లబుషేన్‌(108*) జట్టు స్కోర్‌ 213 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 82 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌ను 251/5కి చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 60 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా 20 ఆటగాళ్లతో.. Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని