close

తాజా వార్తలు

Published : 03/03/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఏపీలో పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్ల పరిధిలోని 671 డివిజన్లు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 2,123 వార్డులకు నామినేషన్ ప్రక్రియ గతేడాది మార్చిలోనే ముగిసింది. దీనికి సంబంధించిన నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ఈ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది. ఈనెల 10న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గంటా వైకాపాలో చేరే అవకాశం: విజయసాయి

2. 24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యం దాదాపు 15వేల కేసులు నమోదవుతున్నప్పటికీ, రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్‌వంటి రాష్ట్రాల్లోనూ కరోనా మరణాలు సంభవించలేదని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆగిపోయిందనుకున్న గుండె మళ్లీ కొట్టుకుంది!

మృత్యువు అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతి చెందాడని భావించి వైద్యులు పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆగిపోయిందనుకున్న అతడి గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా మహాలింగపురలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగింది. శంకర్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురికాగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహాలింగపుర ప్రభుత్వ దవాఖానాకు మార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోదీ ర్యాలీకి దాదా..?

త్వరలో పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. భాజపాతో సై అంటే సై అనే మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ్‌ బెంగాల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిని ఓడించి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అందుకోసం ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతాలో మార్చి 7న జరగనున్న ఎన్నికల ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రమా..?

5. ఆ మాట నేను అనలేదు: అనసూయ

‘‘నాకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్‌మీడియా వేదికగా నన్ను అడిగి తెలుసుకోండి. అంతేకానీ, వేరేవాళ్లు రాసినవి గుడ్డిగా నమ్మేయకండి’’ అని అంటున్నారు నటి అనసూయ. బుల్లితెర వ్యాఖ్యాతగానే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అనసూయ. తాజాగా కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’లో ఆమె ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆద్యంతం హుషారు.. సెన్సెక్స్‌ 51,000+

అంతర్జాతీయ సానుకూల పవనాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణించడంతో వరుసగా మూడోరోజైన బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలను ఒడిసిపట్టాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ ఎగబాకుతూ పోయాయి. ఉదయం 50,738 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 51,539 వద్ద గరిష్ఠాన్ని.. 50,512 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,147 పాయింట్లు లాభపడి 51,444 వద్ద ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో ఐటీ సోదాలు

ముంబయిలో పలు సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. నటి తాప్సీ, నిర్మాత మధు మంతెన, దర్శకుడు వికాస్‌ బెహల్‌ నివాసాలు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు చెందిన ఫాంటమ్‌ ఫిల్మ్స్‌, టాలెంట్‌ హంట్‌ కంపెనీ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. ముంబయి, పుణెల్లో ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాసలీలల సీడీ వివాదం: మంత్రి రాజీనామా 

ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజీనామా లేఖను పంపారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. వాటిపై తక్షణమే దర్యాప్తు జరపాలి. నేను ఏ తప్పూ చేయలేదు. అయితే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా’’ అని రమేశ్‌ లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

9. పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌

సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు ముగింపు పలకాలని పాకిస్థాన్‌ను భారత్‌ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన ఐరాస 46వ మానవ హక్కుల మండలిలో భారత దౌత్యవేత్త పవన్‌కుమార్‌ ఉగ్రవాదంపై పాక్‌ వైఖరిని ఎండగట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ఇకనైనా ఉగ్రవాద చర్యలకు వత్తాసు పలకడం మానుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఇంగ్లాండ్‌కు ఇంకా అవకాశముంది 

ఇంగ్లాండ్‌ జట్టుకు అవకాశాలు మూసుకుపోలేదని.. నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ డ్రా చేసుకోవచ్చని ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. తాజాగా ఓ ఆన్‌లైన్‌లో బ్లాగ్‌లో అతడీ విషయాలను పంచుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులోనూ పిచ్‌లో పెద్దగా మార్పులుండవని చెప్పాడు. కాగా, మొతేరాలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీటర్సన్‌ ఆ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని