close

తాజా వార్తలు

Updated : 03/03/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హెల్మెట్ లేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు జరిమానా!

గతంలోనూ ఇలాగే చలానాలు వేశారని బాధితుడి ఆవేదన

కామారెడ్డి జిల్లాలో పోలీసులు తీరుపై విమర్శలు

కామారెడ్డి: దేశవ్యాప్తంగా నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరిగే ప్రమాదాల్లో శిరస్త్రాణం లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నవారు అనేకం. రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగి వ్యక్తి ప్రాణాలు కోల్పోతే.. అరెరే.. హెల్మెట్‌ ధరించి ఉంటే చనిపోయేవాడు కాదు.. అని అనుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఎంత చెప్పినా ఇప్పటికీ శిరస్త్రాణం లేకుండా రోడ్లపైకి వస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిబంధనలు కఠినతరం చేసి అలాంటివారికి చలానాలు వేస్తూనే ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం లేకుంటే చలానా వేయడం సాధారణమే కదా..! అందులో వింత ఏముంది? అనుకోవచ్చు. కానీ, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. దీంతో అక్కడి పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం చించొల్లి గ్రామానికి చెందిన సతీష్‌కు ట్రాక్టర్‌ ఉంది. హెల్మెట్‌ లేకుండా వాహనాన్ని నడిపినందుకుగాను రూ.1,035 చలానా పడినట్లు ఆన్‌లైన్‌లో నమోదు కావడం సతీష్‌ గుర్తించాడు. ఏపీ25ఏఆర్‌4194 గల వాహనం ఫిబ్రవరి 25న మండలంలోని మద్దికుంటమర్రి ఎక్స్‌రోడ్డులో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపారని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొత్తం రూ.1,035 చలానా మీ-సేవలో చెల్లించాలని సతీష్‌ చరవాణికి సందేశం వచ్చింది. హెల్మెట్‌ లేదని ట్రాక్టర్‌ జరిమానా వేయడం చూసి సతీష్‌ అవాక్కయ్యాడు. 2019 నుంచి ఇలా మూడుసార్లు చలానాలు వేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని సతీష్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు హెల్మెట్‌ లేదని జరిమానా విధించడం పట్ల స్థానికులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. చలానాలు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ రోడ్డు ప్రమాదాల నివారణపై పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని