ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టులో విచారణ
close

తాజా వార్తలు

Published : 01/07/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలన్న పిల్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే తరగతులు ప్రారంభించడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు కొనే ఆర్థిక  స్థోమత అందరికీ ఉంటుందా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై డీఈవోలు చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వం స్పష్టమైన పాలసీ రూపొందించలేదన్న హైకోర్టు ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని