ఇద్దరు తెదేపా సానుభూతిపరుల అరెస్టు
close

తాజా వార్తలు

Published : 23/06/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు తెదేపా సానుభూతిపరుల అరెస్టు

అమరావతి : ఇద్దరు తెలుగుదేశం సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో నలంద కిశోర్‌ అనే వ్యక్తిని ఈ తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసిన కారణంగా అరెస్టు చేశారు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా పోలీసులు వినలేదని కిశోర్‌ బంధువు చెబుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిశోర్ అనుచరుడు కావడంతో ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిశోర్ ఫార్వర్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే విశాఖలోని సీఐడీ కార్యాలయానికి మాజీ మంత్రి గంటా చేరుకున్నారు. కిశోర్‌ని మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. 

మరోవైపు కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా సోషల్‌ మీడియా కార్యకర్త కృష్ణారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని విజయవాడ తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని