రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దాం: విజయసాయి
close

తాజా వార్తలు

Updated : 10/02/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దాం: విజయసాయి

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్టీలకతీతంగా నేతలు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. బుధవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ ఎదుట కార్మికులు నిర్వహించిన బహిరంగ సభలో  రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు పాల్గొన్నారు. వామపక్ష నేతలు సైతం నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణం. ప్రైవేటీకరణను వైకాపా వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో  ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకూడదు. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమం చేద్దాం. భూములను దోచుకోవాలని చూస్తున్నామని కొందరు అంటున్నారు. మాది పేదల పార్టీ, ధనికుల పార్టీ కాదు. వామపక్షాలతో కలిసి ఉక్కు ఉద్యమంలో పోరాడతాం. ఎలాంటి అపోహలు అవసరం లేదని భరోసా ఇస్తున్నా. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని మొదట్నుంచి చెబుతున్నాం. ఐదు దశాబ్దాల క్రితం ఎంతో  పోరాడి సాధించుకున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం అభియోగాలు, ఆరోపణలు చేయెద్దు. అందరం కలిసికట్టుగా పోరాడుదాం’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..ప్రజాభీష్టాన్ని గౌరవించకపోతే గుణాపాఠం తప్పదని హెచ్చరించారు. ‘‘ ఆంధ్రప్రదేశ్‌ పట్ల జాతీయ పార్టీలు వివక్ష చూపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశంలో భాగమే. అవమానకర వైఖరిని కేంద్రం మార్చుకోవాలి. ఆంధ్రా ప్రజలు ఉద్యమబాట పడితే ఆపడం ఎవరితరం కాదు. తిరుపతిలో గెలుస్తామని భాజపా -జనసేన నేతలు అంటున్నారు. ఏపీకి అన్ని విధాలా అన్యాయం చేసి గెలుస్తారా? ప్రధానికి జగన్‌ రాసిన లేఖలో ప్రైవేటీకరణను స్పష్టంగా వ్యతిరేకించారు’’ అని అవంతి శ్రీనివాస్‌ వివరించారు.

ఇవీ చదవండి...

హైదరాబాద్‌లో రూ.91 దాటిన పెట్రోల్‌

ఓటెయ్యకపోతే.. మీ కథ తేలుస్తాTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని