close

తాజా వార్తలు

Published : 15/01/2021 03:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రం విఫలమైతే.. మేమే టీకాను ఫ్రీగా ఇస్తాం! 

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పష్టీకరణ

దిల్లీ: కరోనా నిరోధానికి ఉచితంగా టీకా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ విఫలమైతే తామే ప్రజలకు అందిస్తామని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ఇప్పటికే తాము కేంద్రాన్ని అభ్యర్థించామని, ఈ టీకా డోసుల ఖర్చును భరించలేని వారెందరో ఈ దేశంలో ఉన్నారన్నారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాల్సి ఉందన్నారు. ఉచితంగా టీకా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. అవసరమైతే తామే ఇస్తామని విలేకర్లతో అన్నారు. కరోనా విధుల్లో ఉండి వైరస్‌ సోకడంతో మరణించిన వైద్యుడు హితేశ్‌ గుప్తా కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.కోటి అందజేశారు. వైద్యుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. 

టీకాపై దుష్ప్రచారం చేయొద్దు
వ్యాక్సిన్లపై అసత్యాలు ప్రచారం చేయవద్దని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, మన శాస్త్రవేత్తలు కలిసి అన్ని ప్రొటోకాల్స్‌ పాటించి భద్రతతో రూపొందించిన ఈ టీకాపై ఎలాంటి సందేహాలూ అవసరం లేదన్నారు. ప్రజలు  వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ముందుకురావాలని కోరారు. ఈ టీకాను తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ యోధులకు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ టీకా కరోనా నుంచి, గతేడాది కొవిడ్‌ కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం నుంచి దిల్లీలోని 89 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

 



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని