close

తాజా వార్తలు

Updated : 30/09/2020 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముక్కలు చేసి.. ముఖంపై పెట్రోలు పోసి

అదృశ్యమైన మహిళ దారుణహత్య

ఆభరణాల కోసమే దురాగతం?


మైసమ్మ

వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం: బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన మహిళ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పరిధిలో చోటుచేసుకుంది. వనస్థలిపురం సీఐ మురళిమోహన్‌ తెలిపిన వివరాలు.. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌లో ఉంటున్న బొమ్మరాజు మైసమ్మ (60) కూలి. ఈమెకు భర్త యాదయ్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైదేహినగర్‌లో ఉంటున్న బంధువు మృతి చెందడంతో ఈనెల 27న దశదినకర్మకు సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు 28న వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె 70 తులాల వెండి పట్టాలు, మెడలో రెండు తులాల పుస్తెలతాడు, కమ్మలు ధరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆమె ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగళ్‌పల్లి-కొహెడ దారిలో హత్యకు గురైనట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహం ముక్కలుగా పడి, ముఖం కాలిపోయి ఉంది. దుండగులు ఆమె శరీరాన్ని మూడు ముక్కలుగా చేసి కాళ్లు, మొండెం వేర్వేరు చోట్ల పడేసి, ముఖంపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. వెండి పట్టాలు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ల్లారు. హత్య చేసిన వ్యక్తే మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లి ఆమె మృతదేహంపై చెట్టు కొమ్మలు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు, పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమచారం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.