‘అందుకే చంద్రబాబు,లోకేశ్‌పై తప్పుడు కేసులు’
close

తాజా వార్తలు

Published : 09/05/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అందుకే చంద్రబాబు,లోకేశ్‌పై తప్పుడు కేసులు’

సీఎం జగన్‌పై యనమల విమర్శలు

అమరావతి: కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. సీఎం జగన్‌ చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే సీఎం జగన్‌ మాత్రం ప్రత్యర్థులపై పోరులో బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా సమయం మొత్తం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ముఖ్యమంత్రి కేటాయిస్తున్నారని చెప్పారు. ఎన్‌440కె వైరస్‌ గురించి తెదేపా అధినేత చంద్రబాబు ముందుగానే అప్రమత్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేశ్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యర్థులపై వేధింపులు కట్టిపెట్టి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని యనమల హితవు పలికారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని