కరోనాపై పార్టీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం
close

తాజా వార్తలు

Published : 31/03/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పార్టీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం

అమరావతి: రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు స్వీయ సామాజిక దూరం పాటించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బూత్‌స్థాయి క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు జగన్‌ పలు బాధ్యతలు అప్పగించారు. వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపడుతూనే ప్రజల్లో ధైర్యం నింపాలని వారికి సూచించారు. నిత్యావసర సరకులు ప్రజలకు అందుతున్నాయా లేదా గమనించాలన్నారు. సరకుల పంపిణీలో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకొని నిత్యావసరాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యకర్తలు, నేతలు అప్రమత్తం చేయాలని జగన్‌ వారికి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం రాకుండా చూడాలని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో రైతుకు మేలు జరిగేలా చేయాలన్నారు. వలస కార్మికులు, వ్యవసాయ కూలీలకు భోజన వసతి కల్పించాలని, ఏప్రిల్‌ 14 వరకు ఇంటికే పరిమతమయ్యేలా ప్రజలను చైతన్యపరచాలని జగన్‌ సూచించారు. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని