close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్తగా 1,278 కేసులు

మొత్తంగా లక్షన్నర దాటిన కరోనా పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు కొత్తగా శుక్రవారం 1,278 నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కొవిడ్‌ బాధితుల సంఖ్య 32,224కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికంగా 762 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 171, మేడ్చల్‌లో 85, సంగారెడ్డిలో 36, నల్గొండలో 32, కామారెడ్డిలో 23, మెదక్‌లో 22, ఖమ్మంలో 18, మంచిర్యాలలో 17, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేటల్లో 14 చొప్పున కేసులను గుర్తించారు. శుక్రవారం నాటి ఫలితాల్లో రాష్ట్రంలో 27 జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులను నిర్ధారించారు.
  60 శాతం డిశ్ఛార్జీలు
ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసొలేషన్‌లో 12,680 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 1,013 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి బయట పడిన వారి సంఖ్య 19,205కు చేరుకుంది. అంటే మొత్తం నమోదైన కేసుల్లో 60 శాతం మంది ఆరోగ్యవంతులుగా మారారు. మహమ్మారికి శుక్రవారం మరో 8 మంది మృత్యువాతపడగా, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 339కి పెరిగింది. మొత్తం బాధితుల్లో 1 శాతం మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 17,081 పడకలు కొవిడ్‌ బాధితుల కోసం సిద్ధం చేయగా, ఇందులో శుక్రవారం నాటికి 1,618 మాత్రమే నిండి ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ కేంద్రంగా సేవలందిస్తోన్న గాంధీఆసుపత్రిలో 803 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, 1,087 పడకలు ఖాళీగా ఉన్నాయి.


  యాంటీజెన్‌లతో పెరిగిన పరీక్షలు
గడిచిన 24 గంటల్లో 10,354 కరోనా పరీక్షలను నిర్వహించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో యాంటీజెన్‌ పరీక్షలను జీహెచ్‌ఎంసీలో 300 వైద్యశాలలతో పాటు అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో నిర్వహిస్తుండటంతో.. ఆ మేరకు పరీక్షల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నిర్వహించిన పరీక్షల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటి వరకూ చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 1,51,109కు పెరిగింది. ఇందులో 1,18,885 మందిలో వైరస్‌ లేదని తేలింది.

ఏపీలో కొత్తగా 1,608 మందికి పాజిటివ్‌
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 1,608  కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 25,422కు చేరింది. కరోనాతో మరో 15 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 292కు చేరింది.
* తమిళనాడులో శుక్రవారం కొత్తగా 3,680 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,30,261కి చేరింది. 64 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
* కర్ణాటకలో కొత్తగా 2,313 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 33,418కి పెరిగింది. గడచిన 24గంటల్లో 57మంది మృతి చెందారు

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.