మోదీకే అధిక జనామోదం
close

ప్రధానాంశాలు

మోదీకే అధిక జనామోదం

అంతర్జాతీయ నేతల్లో ఆయనదే అగ్రస్థానం
..అయితే గత ఏడాది కంటే తగ్గిన ఆదరణ
తాజా సర్వేలో వెల్లడి

దిల్లీ: అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాల అధినేతల కంటే ప్రధాని నరేంద్ర మోదీకి జనామోదం ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఆదరణ కాస్త తగ్గినప్పటికీ.. ఇప్పటికీ జనామోదం విషయంలో ఆయనే అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన డేటా నిఘా సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ 13 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా భారత్‌లో 2,126 మంది వయోజనుల నుంచి ఆన్‌లైన్‌ వేదికగా అభిప్రాయాలు సేకరించింది. మోదీకి 66% మంది ఆమోదం ఉన్నట్లు నిర్ధారించింది. అయితే- గత ఏడాది (75%)తో పోలిస్తే ఈ దఫా ఆయనకు ఆదరణ తగ్గినట్లు స్పష్టం చేసింది. గత ఏడాది కేవలం 20% మంది మోదీని వ్యతిరేకించగా, ఇప్పుడు వారి శాతం 28కి పెరిగినట్లు తెలిపింది. జనామోదం విషయంలో ఆయన తర్వాతి స్థానాల్లో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాఘి, మెక్సికో అధ్యక్షుడు అండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ అబ్రడార్‌ ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు ‘అంతర్జాతీయ నేతల ఆమోద రేటింగ్‌ ట్రాకర్‌’లో ఈనెల 17న మార్నింగ్‌ కన్సల్ట్‌ తాజా వివరాలను పొందుపరిచింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని