మెరుగైన వైద్యానికే మా మిషన్‌

ప్రధానాంశాలు

మెరుగైన వైద్యానికే మా మిషన్‌

మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌

నిజామాబాద్‌ ఆసుపత్రికి 120 ఐసీయూ పడకల వితరణ

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: దేశంలోని చాలామంది జీవితాల్లో కొవిడ్‌ చీకట్లు నింపిందని భారత మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నారు. యూవీకెన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రూ.2.50 కోట్లతో 120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. పడకలతో పాటు 120 మానిటర్లు, 18 వెంటిలేటర్లు, 100 బల్క్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేశారు. ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ వీటికి ఆర్థిక సహకారం అందించింది. ఈ సందర్భంగా బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువరాజ్‌ మాట్లాడారు. కరోనా సమయంలో ఆసుపత్రుల్లో పడకలు చాలక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. వెంటిలేటర్లు లేక ప్రాణాలు కోల్పోయారన్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు కల్పించేందుకు యూవీకెన్‌ ఫౌండేషన్‌ తరఫున ‘మిషన్‌ 1000 పడకలు’ ప్రాజెక్టు చేపట్టామని ఆయన వివరించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. నిజామాబాద్‌ ఆసుపత్రిలో 120 ఐసీయూ పడకలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఇది సాధ్యమైందని, అత్యాధునిక పరికరాలు జిల్లా ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. ఫౌండేషన్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందించారు. యాక్సెంచర్‌ ప్రతినిధులు, యువరాజ్‌ తల్లి షబ్నం సింగ్‌, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని