కర్ణాటక సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం

ప్రధానాంశాలు

కర్ణాటక సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం  11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ నూతన ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప, కేంద్ర పరిశీలకులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌ రెడ్డి, భాజపా నాయకురాలు డి.కె.అరుణ్‌ తదితరులు హాజరయ్యారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులతో వరదలపై సమీక్షించారు. త్వరలో దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతానని బొమ్మై వెల్లడించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని