ఫిబ్రవరి 5న రాష్ట్రానికి ప్రధాని

ప్రధానాంశాలు

ఫిబ్రవరి 5న రాష్ట్రానికి ప్రధాని

ముచ్చింతల్‌లో రామానుజాచార్య  విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

ఈనాడు, దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రోజు హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని త్రిదండి చినజీయర్‌స్వామి ఆహ్వానించారు. మైహోమ్‌ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుతో ఆయన ఇక్కడ ప్రధానిని కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. కుల, వర్గ బంధనాలను తెంచి భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటిచెప్పడానికే 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానికి వివరించారు. ప్రపంచ శాంతి కోసం చినజీయర్‌స్వామి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చినట్లు ఆహ్వానితులు తెలిపారు. ఫిబ్రవరి 5న వస్తున్నట్టు వెల్లడించారు. ఇంతక్రితమే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌, పలువురు మంత్రులను చినజీయర్‌స్వామి, జూపల్లి కలిసి ఆహ్వానించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని