ఓం ణమోకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు

ప్రధానాంశాలు

ఓం ణమోకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు

కన్నడ నవలను తెలుగులోకి అనువదించిన రంగనాథ రామచంద్రరావు

ఈనాడు, దిలీ, ఆదోని పట్టణం, న్యూస్‌టుడే: ఓం ణమో నవల ఉత్తమ తెలుగు అనువాదంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2020కి ఎంపికైంది. కన్నడలో ఇదే పేరుతో శాంతినాథ దేశాయ్‌ రచించిన నవలను తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనువదించారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన లోగడ.. నవలేఖన కన్నడ కథలు, సిగ్నల్‌ (ప్రపంచ భాషల ప్రసిద్ధ కథలు), బోరుబావులకు రీఛార్జ్‌, జోగిని మంజమ్మ ఆత్మకథ, ఓ నగరం కథ, కోకిల-గులాబి పేరుతో ఎన్నో పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఆయన తన రచనలకు పలు పురస్కారాలు అందుకున్నారు. 3 సొంత కథాసంపుటాలు, 8 అనువాద నవలలు, 14 అనువాద కథా సంకలనాలు, 4 ఆత్మకథలు, ఒక జీవనచరిత్ర, 2సొంత నవలలు రాశారు. బాలల కోసం పది పుస్తకాలు రాశారు. ప్రొఫెసర్‌ జీఎస్‌ మోహన్‌, పాపినేని శివశంకర్‌, అమ్మంగి వేణుగోపాల్‌లతో కూడిన జ్యూరీ ‘ఓం ణమో’ను ఉత్తమ తెలుగు అనువాదంగా ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 24 పుస్తకాలు అనువాద అవార్డులకు ఎంపికయ్యాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని