ప్రపంచ పరిశోధకుల జాబితాలో హెచ్‌సీయూ ఆచార్యులు

ప్రధానాంశాలు

ప్రపంచ పరిశోధకుల జాబితాలో హెచ్‌సీయూ ఆచార్యులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా 200 మంది అగ్రశ్రేణి పరిశోధకుల జాబితాలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు ఆచార్యులకు చోటు దక్కింది. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్‌, సైటెక్‌ స్ట్రాటజీస్‌ సంస్థలకు చెందిన జెరోయాన్‌ బాస్‌, కెవిన్‌ బొయాక్‌, జాన్‌ పి.ఎ.లాన్నిడిస్‌ ఆధ్వర్యంలో ప్రపంచంలో విద్యాపరంగా ఉత్తమ పరిశోధకుల జాబితాను రూపొందించారు. ఇందులో హెచ్‌సీయూ పర్యావరణశాస్త్ర ఆచార్యుడు ఎంఎన్‌వీ ప్రసాద్‌ 102వ ర్యాంకు పొందారు. ఆంగ్ల విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ ప్రమోద్‌ కె.నాయర్‌కు 120, రసాయనశాస్త్ర ఆచార్యుడు అశ్విని నాంగియా 121, స్టాటిస్టిక్స్‌ ఆచార్యుడు సీఆర్‌ రావుకు 184వ ర్యాంకులు లభించాయి. ఆంగ్ల, సాహిత్య అధ్యయనాల విషయంలో భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి స్థానం సంపాదించిన ఏకైక ఆచార్యుడిగా ప్రమోద్‌ రికార్డు సృష్టించారు. ఇక భారత్‌ నుంచి సబ్జెక్టుల వారీగా ‘టాప్‌ 2 శాతం’ పరిశోధకుల జాబితాలో పై నలుగురు సహా మొత్తం 20 మంది వర్సిటీ ఆచార్యులు చోటు సంపాదించారు.  మరోవంక..హెచ్‌సీయూలోని డీఆర్‌ఐఎల్‌ఎస్‌కి చెందిన సౌమిత్ర సేన్‌గుప్తా, మనోజిత్‌పాల్‌కీ ఈ జాబితాలో చోటు లభించింది. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజేరావు మాట్లాడుతూ.. పరిశోధనల పరంగా హెచ్‌సీయూ ఆచార్యులు ఉత్తమంగా ఉన్నట్లు మరోసారి రుజువైందన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని