డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం

ప్రధానాంశాలు

డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం

కేసీఆర్‌ వ్యాఖ్యలు సీఎం జగన్‌కు చెంపపెట్టు: చంద్రబాబు

ఈనాడు, దిల్లీ: ‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాం...’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే ముందు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో మీడియాతో మంగళవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం ఓ రాజకీయపార్టీగా తమ బాధ్యతని, అందుకే దిల్లీ వచ్చామన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, దీనిపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటైన పిల్లలు, యువకులు ఆ వ్యసనం నుంచి బయటపడలేరని, వారి జీవితం అక్కడితో ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పార్టీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అడుగుతున్నారని, కరెంటు కోతలు, ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు చెంపపెట్టు అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని