‘ఈనాడు’ ప్రాపర్టీ షో 30, 31 తేదీలలో

ప్రధానాంశాలు

‘ఈనాడు’ ప్రాపర్టీ షో 30, 31 తేదీలలో

ఈనాడు, హైదరాబాద్‌: మీ బడ్జెట్‌లో సొంతింటి కోసం వెతుకుతున్నారా? పెట్టుబడి పెట్టే దృష్టితో స్థలాలు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ ప్రయత్నం సాకారానికి సరైన వేదిక ‘ఈనాడు’ ప్రాపర్టీ షో. నగరంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ఇది ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఈ నెల 30, 31న హైటెక్‌ సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ప్రాపర్టీ షో జరగనుంది. విల్లాలు మొదలు గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు, లేఅవుట్‌ వెంచర్ల వరకు ఆయా ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తమ స్టాళ్లలో ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోని ప్రీమియం ప్రాజెక్టులు, ఇతర ప్రాంతాల్లోని బడ్జెట్‌ ఆవాసాలు, శివార్లలోని విల్లాల గురించీ ఇక్కడ తెలుసుకోవచ్చు. పలు బ్యాంకులు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తుండటంతో..నచ్చిన స్థిరాస్తిని ఎంపిక చేసుకుని, అక్కడికక్కడే బ్యాంకు రుణాలు కూడా పొందవచ్చు. శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ షోలో ప్రవేశం ఉచితమని, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 9701112439, 8008552667 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని