Vaccination: దిల్లీలో కోటి డోసులు పూర్తయ్యాయి.. కేజ్రీవాల్‌ ప్రకటన

తాజా వార్తలు

Published : 31/07/2021 21:51 IST

Vaccination: దిల్లీలో కోటి డోసులు పూర్తయ్యాయి.. కేజ్రీవాల్‌ ప్రకటన

దిల్లీ: కరోనా కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దిల్లీ కీలక మైలురాయిని చేరుకుంది. దేశ రాజధాని నగరంలో కోటి డోసులు పంపిణీ పూర్తైనట్టు సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. మొత్తంగా 76 లక్షల మందికి ఒక డోసు అందించగా.. 26లక్షల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయన్నారు. ఇందులో 50శాతానికి పైగా వయోజనులే ఉన్నట్టు సీఎం తెలిపారు.  ఈ లక్ష్య సాధనకు కృషిచేసిన ఆరోగ్య కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. దిల్లీలో దాదాపు 2కోట్ల మందికి పైగా జనాభా ఉండగా.. వారిలో 1.5కోట్ల మంది 18 ఏళ్లు పైబడినవారేనని తెలిపారు. వారంతా వ్యాక్సిన్‌కు అర్హులేనన్నారు. దిల్లీలో టీకా వేయించుకొనేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకొస్తున్నా.. టీకా కొరత నెలకొనడంతో వ్యాక్సినేషన్‌కు ఆటంకాలు తలెత్తుతున్నాయన్నారు.

అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేసిన కేజ్రీవాల్‌.. ఇంకా టీకా వేసుకోనివారికి అందించడంతో పాటు రెండో డోసు అందించడం తమ ముందు సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు.  రోజుకు 50 వేల నుంచి 70వేల వరకు డోసులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. సరిపడినన్ని వ్యాక్సిన్‌డోసులు గనక ఉంటే రోజుకు 3లక్షల డోసుల టీకాను సులభంగా పంపిణీ చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. కానీ, టీకా కొరతతో ఆటంకం ఏర్పడుతోందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని