నేపాల్‌లో వరదల బీభత్సం: 38మంది మృతి

తాజా వార్తలు

Published : 04/07/2021 01:36 IST

నేపాల్‌లో వరదల బీభత్సం: 38మంది మృతి

కాఠ్‌మాండూ: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో ఉప్పొంగిన నదులతో సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీనికి తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం జరిగింది. గడిచిన 20 రోజుల వ్యవధిలో ఈ ప్రకృతి విలయం దాటికి 38మంది మృతిచెందగా.. 50మందికి పైగా గాయపడినట్టు నేపాల్‌ హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. 51 మంది గాయాలతో కోలుకుంటుండగా.. ముగ్గురు చిన్నారులు సహా 24 మంది వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైనట్టు వివరించింది. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నేపాల్‌ సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపింది. వరదలతో మొత్తంగా 790 ఇళ్లు నీట మునగగా.. పలు వంతెనలు ధ్వంసమైనట్టు పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని