ఆ రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా మరణాలు

తాజా వార్తలు

Updated : 21/03/2021 23:23 IST

ఆ రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా మరణాలు

83 శాతం కొత్త కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,846 కొత్త కేసులు నమోదు కాగా, ఇందులో 83(83.14) శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనే వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 27, 126 కేసులు రాగా, పంజాబ్‌ 2,578, కేరళలో 2,078 పాజిటివ్‌లు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో కేసుల సంఖ్య వెయ్యికి పైగానే ఉందని అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130 కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో మహమ్మారి ధాటికి నిన్న ఒక్క రోజే 197 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఆరు రాష్ట్రాల్లోనే 86.8 శాతం మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య మొత్తం 3,09,087కి పెరిగింది. కొత్తగా నమోదవుతోన్న కరోనా మరణాలు అధికంగా మహారాష్ట్రలోనే ఉండగా, గడిచిన 24 గంటల్లో 92 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని