ఆ అయిదు రాష్ట్రాల్లోనే 62 శాతం..!

తాజా వార్తలు

Published : 03/01/2021 02:12 IST

ఆ అయిదు రాష్ట్రాల్లోనే 62 శాతం..!

దిల్లీ: దేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌,  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కలిపి 62 శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ, కుటుంబ సంక్షేమశాఖ శనివారం తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో  2,50,183 క్రియాశీల కేసులున్నాయి. వీటిలో 62 శాతం కేసులు ఈ అయిదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 65,054 యాక్టివ్‌ కేసులుండగా, 3 వేలకుపైగా మరణించారు. సుమారు 2 మిలియన్ల కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో 52,084 క్రియాశీల కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13,831, పశ్చిమ బెంగాల్‌లో 11,616, ఛత్తీస్‌గఢ్‌లో 11,344 యాక్టివ్ కేసులు ఉన్నాయని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని