Corona: 69% మందికి కనీసం ఒక డోసు పూర్తి: కేంద్రం

తాజా వార్తలు

Published : 30/09/2021 20:16 IST

Corona: 69% మందికి కనీసం ఒక డోసు పూర్తి: కేంద్రం

దిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని.. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 69శాతం మంది జనాభాకు కనీసం ఒక డోసు టీకా అందించినట్టు కేంద్రం వెల్లడించింది. 25శాతం మందికి రెండు డోసులూ పూర్తిచేసినట్టు తెలిపింది. గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 59.66శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం కేరళలో లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం మీడియాకు వివరించారు.

అనవసర ప్రయాణాలు మానుకోవడమే ఉత్తమం!

‘‘కొవిడ్‌ పరీక్షలు తగ్గించలేదు. ప్రతి రోజూ 15 లక్షల నుంచి 16లక్షల మేర శాంపిల్స్‌ టెస్ట్‌ చేస్తున్నాం. 30 జిల్లాల్లో కొవిడ్ వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగానే ఉంది. మరో 18 జిల్లాల్లో ఇది 5 నుంచి 10శాతంగా ఉంది. జనసాంద్రత పెరిగే ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అనవసర ప్రయాణాలు మానుకోవడమే తెలివైన పని. తక్కువ సంఖ్యలో పాల్గొని పండుగలు జరుపుకోవాలి. జైకోవ్‌-డి మూడు డోసుల్లో ఇచ్చే వ్యాక్సిన్‌.  సూదిని వినియోగించకుండా ఇచ్చే  ఈ టీకా ధర ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాటి ధరలకు భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని