10 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు: కేంద్రం

తాజా వార్తలు

Published : 15/05/2021 18:32 IST

10 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు: కేంద్రం

దిల్లీ: దేశంలో నమోదువుతున్న 85 శాతం కరోనా కేసులు 10 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మరో 8 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. 24 రాష్ట్రాల్లో 15 శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు.

మొత్తంగా చూసినప్పుడు దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 15.07 శాతం అంటే 36,73,802 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జాతీయ రికవరీ రేటు సైతం 83.83 శాతానికి పెరిగిందని తెలిపింది. 8 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. అలాగే 17 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ కేసులు తగ్గుముఖం లేదా స్థిరంగా కొనసాగుతుండగా.. ఈ జాబితాలో తెలంగాణ ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని