స్విస్‌లోనూ 90ఏళ్ల బామ్మకు తొలి టీకా!

తాజా వార్తలు

Published : 23/12/2020 23:40 IST

స్విస్‌లోనూ 90ఏళ్ల బామ్మకు తొలి టీకా!

బెర్లిన్‌: కరోనాపై పోరాటంలో స్విట్జర్లాండ్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ వ్యాప్తంగా లక్ష డోసుల ఫైజర్‌ టీకా పంపిణీని అక్కడి మిలిటరీ ప్రారంభించింది. ఇందులో భాగంగా లూసెర్న్‌ నగరానికి చెందిన 90 ఏళ్ల బామ్మ బుధవారం ఈ టీకా తొలి డోసును అందుకున్నారు. దీంతో స్విట్జర్లాండ్‌లో ఈ టీకా అందుకున్న తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. నర్సింగ్‌, కేర్‌ హోంలలో ఉన్నవాళ్లు తొలుత టీకాలు అందుకుంటారని లూసెర్న్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. తొలి టీకా అందుకున్న బామ్మ పేరు మాత్రం వెల్లడించలేదు.

స్విట్జర్లాండ్‌లో ఎక్కువ జనాభా కలిగిన జ్యూరిచ్‌ నగరంలో మాత్రం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి 4 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిసెంబర్‌లోనే బ్రిటన్‌, అమెరికాలలో ఫైజర్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో తొలి టీకాను కూడా 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ అనే బామ్మకు వేయగా.. అమెరికాలో తొలి టీకాను ఓ నర్సు అందుకున్న విషయం తెలిసిందే. 

స్విట్జర్లాండ్‌లో 4.15 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు, 6,300 మరణాలు నమోదయ్యాయి. అయితే, ఫైజర్‌ టీకాకు శనివారమే స్విస్‌మెడిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం తెలిపింది. తొలుత 1.7లక్షల డోసులను పంపిణీ చేసిన అనంతరం.. జనవరి నుంచి నెలకు 2.5 లక్షల డోసుల చొప్పున ఈ టీకాను పంపిణీ చేసేందుకు అక్కడి సైన్యం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 

ఇదీ చదవండి..

కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని