అమెరికా రాజధానిలో బైడెన్‌ క్లీన్‌స్వీప్‌!

తాజా వార్తలు

Updated : 04/11/2020 13:48 IST

అమెరికా రాజధానిలో బైడెన్‌ క్లీన్‌స్వీప్‌!

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లోనూ వీరిద్దరి మధ్య కేవలం స్వల్ప తేడానే ఉంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందంజలో ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో బైడెన్‌ విజయం సాధించారు. అయితే, అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ(డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా)ని మాత్రం డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ క్లీన్‌ స్వీప్‌చేశారు. ఇప్పటివరకు ఆయనకు దాదాపు 93శాతం పాపులర్‌ ఓట్లు లభించాయి. ట్రంప్‌నకు కేవలం 5.6శాతం మాత్రమే వచ్చాయి. 6లక్షలకు పైగా జనాభా కలిగిన డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో బైడెన్‌ 2లక్షలకు పైగా పాపులర్‌ ఓట్లు సాధించారు. ట్రంప్‌ కేవలం 12వేల పైచిలుకు పాపులర్‌ ఓట్లు మాత్రమే పొందగలిగారు. అయితే, చిన్న నగరం కావడంతో ఇక్కడ ఎలక్టోరల్‌ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ మూడు బైడెన్‌ కైవసం చేసుకున్నారు.

ఇదిలాఉంటే, అమెరికాలో పాపులర్‌ ఓట్లు ఎక్కువ సాధించినప్పటికీ విజయం దగ్గకపోవచ్చు. విజేతను నిర్ణయించేది మాత్రం ఎలక్టోరల్‌ ఓట్లు మాత్రమే. 538 ఎలక్టోరల్‌ ఓట్లున్న అమెరికాలో 270సాధించిన వారే విజేత. అయితే, అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇప్పటివరకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా బైడెన్‌కు 225 ఓట్లు వచ్చాయి. మిగతా స్థానాల్లో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, టెక్సాస్‌లో ట్రంప్‌ విజయం సాధించారు.

ఇవీ చదవండి..
ట్రంప్‌ స్వింగ్‌ బాల్‌!
గెలుపుపై ట్రంప్‌, బైడెన్‌ ధీమా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని