ఒబామా కంటే బైడెన్‌కే ఎక్కువ ఓట్లు!

తాజా వార్తలు

Updated : 05/11/2020 14:15 IST

ఒబామా కంటే బైడెన్‌కే ఎక్కువ ఓట్లు!

వాషింగ్టన్‌: ఉత్కంఠగా సాగుతోన్న అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపులో జో బైడెన్‌ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. అమెరికా మీడియా ప్రకారం, బైడెన్‌కు ఇప్పటికే 264 ఎలక్టోరల్‌ ఓట్లు లభించగా అధ్యక్షుడు ట్రంప్‌నకు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా జో బైడెన్‌ మరో రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా నిలువనున్నారు. ఇప్పటివరకు ఆయనకు 7కోట్ల 19లక్షల ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయి. ట్రంప్‌ మాత్రం 6కోట్ల 85లక్షల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న దృష్ట్యా బైడెన్‌కు మరిన్ని పాపులర్‌ ఓట్లు పెరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా గతంలో బరాక్‌ ఒబామా సాధించిన ఓట్ల కంటే బైడెన్‌ ఎక్కువ సాధించారు. 2008లో ఒబామాకు 6 కోట్ల 98లక్షల ఓట్లు వచ్చాయి. తాజాగా బైడెన్‌ ఒబామాను అధిగమించి 7కోట్లకు పైగా ఓట్లను సాధించారు. ఈసారి గడిచిన వందేళ్లలోనే ఈసారి అత్యధిక పోలింగ్‌ నమోదైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని