కారుబాంబు పేలుడులో 8 మంది మృతి

తాజా వార్తలు

Updated : 20/12/2020 16:04 IST

కారుబాంబు పేలుడులో 8 మంది మృతి

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా నేడు దేశ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్న ఓ కారు బాంబు పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని నగరం పశ్చిమ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి..  స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని