రాష్ట్రాల్లో కరోనా కట్టడికి కేంద్ర బృందాలు!

తాజా వార్తలు

Published : 23/11/2020 00:21 IST

రాష్ట్రాల్లో కరోనా కట్టడికి కేంద్ర బృందాలు!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. పరిస్థితి అదుపులోకి రాని రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపుతోంది. అందులో భాగంగా నేడు ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌కు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలు చేరుకోనున్నాయి. గతవారం హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, మణిపూర్‌కు కేంద్రం ప్రత్యేక బృందాల్ని పంపింది. ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆదిలోనే కట్టడి చేయాలని ప్రభుత్వం ఈ చర్యలను ప్రారంభించింది.

ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలో ఈ బృందాలు పర్యటిస్తాయని అధికారులు తెలిపారు. వైరస్‌ కట్టడికి స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి.. అదనపు సాయాన్ని అందిస్తారన్నారు. కేసులను సకాలంలో గుర్తించడంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించి మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని