చైనాకు ఆ హక్కు లేదన్న అమెరికా

తాజా వార్తలు

Published : 19/11/2020 02:20 IST

చైనాకు ఆ హక్కు లేదన్న అమెరికా

వాషింగ్టన్‌: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఎంపిక చేసే హక్కు చైనాకు లేదని అమెరికా ప్రకటించింది. వందల సంవత్సరాల నుండి టిబెట్‌కు చెందిన బౌద్ధ మతస్థులే తదుపరి దలైలామాను ఎంపిక చేసుకుంటున్నారని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ తమకా హక్కుందనటం అర్థరహితమని అమెరికాకు చెందిన లార్జ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడం రాయబారి శామ్యూల్‌ డీ బ్రౌన్‌బ్యాక్‌ అన్నారు. 

అక్టోబర్‌లో తన భారత పర్యటన సందర్భంగా ధర్మశాలలో శరణార్థులుగా ఉన్న టిబెట్‌ పౌరులతో మాట్లాడానని ఆయన అన్నారు. తదుపరి దలైలామాను చైనా ఎంపిక చేయడానికి అమెరికా వ్యతిరేకమని వారికి స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు. ఆ విధంగా చేసేందుకు డ్రాగన్‌కు హక్కు లేదని.. అందుకు ఏ సైద్ధాంతికత లేదని శామ్యూల్‌ వివరించారు. మత గురువుల ఎంపిక విషయంలో వందల సంవత్సరాలుగా నడుస్తున్న సంప్రదాయమే కొనసాగాలని ఓ ప్రశ్నకు జవాబుగా  చెప్పారు. అగ్రరాజ్యం మత స్వేచ్ఛకు ఎప్పుడూ అండగా ఉంటుందని.. ఈ విషయమై టిబెట్‌కు మద్దతిచ్చేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధమేనని వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా వయస్సు 85 సంవత్సరాలు. స్థానిక టిబెట్‌ ప్రజల తిరుగుబాటును చైనా ప్రభుత్వం అణిచివేసి.. టిబెట్‌లో అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన 1959 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని