
తాజా వార్తలు
డ్రాగన్ పరిశోధనకు దీటైన జవాబు
కరోనా ఎక్కడ పుట్టిందో ప్రపంచమంతటికీ తెలుసు..:సీఎస్ఐఆర్
దిల్లీ: మహమ్మారి కొవిడ్-19 మూలాలు భారత్, బంగ్లాదేశ్‌లలో ఉన్నాయంటోన్న చైనా పరిశోధన అత్యంత లోపభూయిష్టమని భారత్ ఖండించింది. పేలవంగా సాగిన ఈ పరిశోధన, శాస్త్రీయ సమీక్షకు నిలువలేదని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ ముండే స్పష్టం చేశారు. కరోనా వైరస్‌కు మూలం భారత్ అంటున్న ఈ పరిశోధన వివరాలను తాను చదివానని.. ఆ విశ్లేషణ అత్యంత ఘోరంగా ఉందన్నారు. లాన్సెట్‌లో ప్రచురించిన ఈ పరిశోధనను సమగ్రంగా సమీక్షించనే లేదని ఆయన ఎత్తిచూపారు.
భారత్‌లో మనుషులు, కోతుల సాహచర్యం అధికమన్న చైనా ఆరోపణకు కొవిడ్ వైరస్‌కు ఏ సంబంధం లేదని డాక్టర్ ముండే స్పష్టం చేశారు. ఇందుకు వారు చూపిన ఆధారాలు, అనుసరించిన విధానాలు శాస్తప్రమాణాలకు అనుగుణంగా లేవన్నారు. విస్తృత పరిధిలో కాకుండా.. పరిమిత గణాంకాల ఆధారంగా సాగిన ఈ పరిశోధన మొత్తం అవకతవకలే అని రుజువవుతోందని శాస్త్రవేత్త అన్నారు.
కొవిడ్ మహమ్మారి మూలం చైనాలోని వుహాన్ అని ప్రపంచం ఆమోదించిందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ అన్నారు. భారత్ కూడా దాన్నే నమ్ముతోందని ఆయన స్పష్టం చేశారు. నిజం ఏమిటనేది కళ్లకు కట్టినట్టు తెలుస్తుండగా.. రాజకీయం చేయాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
