భారత్‌లో ఒక్కరోజే 64వేల కేసులు!

తాజా వార్తలు

Published : 09/08/2020 10:20 IST

భారత్‌లో ఒక్కరోజే 64వేల కేసులు!

24గంటల్లో మరో 861మంది మృతి
21లక్షలు దాటిన కేసులు, 43వేల కొవిడ్‌ మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 64,339 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 60వేల కేసులు దాటడం వరుసగా ఇది మూడోసారి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం కేసులసంఖ్య 21,53,000కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 14లక్షల 80వేల మంది కోలుకోగా మరో 6లక్షల 28వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 53వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68శాతం దాటడం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 21రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

24గంటల్లో 861 మంది మృత్యువాత..
భారత్లో కొవిడ్ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 900మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకరంగా మారింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మరో 861 మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 43,379కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ బాధితుల మరణాల రేటు 2.04శాతంగా ఉంది. 
కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ముందుండగా బ్రెజిల్‌, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కరోనా సోకి ఇప్పటివరకు లక్షా 62వేల మంది ప్రాణాలు కోల్పోగా బ్రెజిల్‌లో ఈ సంఖ్య లక్షకు చేరింది. కొవిడ్‌ మరణాల్లో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ సంఖ్య 43వేలు దాటింది.

ఇవీ చదవండి..
బలవర్ధకం..రోగనిరోధకం..!
సెప్టెంబరు నాటికి తగ్గుముఖం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని