50వేలకు చేరువలో కరోనా మరణాలు!

తాజా వార్తలు

Published : 16/08/2020 09:48 IST

50వేలకు చేరువలో కరోనా మరణాలు!

24గంటల్లో 63వేల కేసులు, 944మంది మృతి

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారిసంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దేశంలో దాదాపు 1000మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో మరో 944మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 49,980కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక పాజిటివ్‌ కేసుల పెరుగుదల రోజురోజుకు కొనసాతూనే ఉంది. దేశంలో నిత్యం దాదాపు 60వేల మంది ఈ వైరస్‌ బారినపడుతున్నారు. నిన్న ఒక్కరోజే కొత్తగా మరో 63,490 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులసంఖ్య 25,89,682కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 18లక్షల 62వేల మంది కోలుకున్నారు. మరో 6లక్షల 77వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న మరో 53వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71శాతం దాటగా మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది. కొవిడ్‌ మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని