భారత్‌లో కరోనా @ గ్రాఫ్‌లను చూడండి..!

తాజా వార్తలు

Updated : 30/07/2020 21:05 IST

భారత్‌లో కరోనా @ గ్రాఫ్‌లను చూడండి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదుకావడం కలవరపెడుతోంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా బుధవారం ఒక్కరోజే 52వేలకు పైగా కేసులు, 775 మరణాలు నమోదు కావడం ఈ మహమ్మారి విజృంభణకు అద్దంపడుతోంది. మరోవైపు, కరోనాతో పోరాడి డిశ్చార్జి అయినవారి సంఖ్య 10లక్షలు దాటడం కొంత ఉపశమనం కలిగించే అంశం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు చేశారు? నమోదైన పాజిటివ్‌ కరోనా కేసులెన్ని? మరణాల రేటు, రికవరీ రేటు ఎలా ఉంది? ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు ఎలా ఉంది? తదితర గణాంకాలతో కూడిన గ్రాఫ్‌లను ఓసారి పరిశీలిస్తే..

ఈ రోజు ఉదయం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. బుధవారం ఒక్క రోజే 4,46,642 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 1.82 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించారు.

రోజుకు 5లక్షల టెస్టులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రోజురోజుకీ టెస్టుల సంఖ్య పెంచుతోంది. ఈ ఒక్క నెలలోనే నిర్వహించిన టెస్టులను పరిశీలిస్తే.. 

దేశంలో కరోనా వైరస్‌తో పోరాడి రికవరీ అయినవారి సంఖ్య 10లక్షలు దాటింది. జాతీయ రికవరీ రేటు 64.44శాతంగా ఉంది.

భారత్‌లో తొలి నుంచీ రికవరీ రేటు క్రమంగా పెరుగుతుండటం సానుకూలాంశం. ఏప్రిల్‌ నెలలో 7.85శాతంగా ఉండగా.. ఇప్పుడు రికవరీ రేటు 64.44శాతానికి పెరిగింది.

16రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. తెలంగాణలో రికవరీ రేటు 74.27%గా ఉంది.

 

దేశంలో కొవిడ్‌ మరణాలు 35వేలకు చేరువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 775 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.21%గా ఉంది.

మరణాల రేటు జాతీయ సగటు 2.21%గా ఉంటే.. 24 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం విశేషం. పలు రాష్ట్రాల్లో మరణాల రేటు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6.67లక్షల మంది కొవిడ్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, అమెరికా, బ్రెజిల్‌, ఇరాన్‌, మెక్సికో, యూకేలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగానే ఉంది. భారత్‌లో మరణాల రేటు 2.21%గా ఉండగా.. అంతర్జాతీయ సగటు 4%గా  ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని