41వ రోజు: కేసుల కంటే రికవరీలే ఎక్కువ!

తాజా వార్తలు

Published : 13/11/2020 18:33 IST

41వ రోజు: కేసుల కంటే రికవరీలే ఎక్కువ!

దేశవ్యాప్తంగా 5.5శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలకు దిగువనే ఉండటం వరుసగా ఇది మూడోరోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇవి కేవలం 5.5 శాతమేనని తెలిపింది. గడిచిన 40 రోజుల్లో నిత్యం కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్న కేసులే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 49వేల మంది కోలుకున్నారు. కొత్త కేసులతో పోలిస్తే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం వరుసగా ఇది 41వ రోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం, దేశంలో కొవిడ్‌ రికవరీ రేటు 92.97 శాతానికి చేరుకుందని, ఇప్పటి వరకు 81లక్షల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని తెలిపింది. 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 77శాతం రికవరీ కేసులు ఉన్నాయని పేర్కొంది.

రోజువారీ రికవరీలు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. ఇక్కడ నిన్న ఒక్కరోజే 7,809 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారిసంఖ్య 16 లక్షల 5 వేలకు చేరింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్‌ కేసులు దేశ రాజధాని దిల్లీలోనే ఎక్కువ (7053) నమోదవుతున్నాయి. కేరళ (5537), మహారాష్ట్ర (4,496) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో మాత్రం ఎక్కువగా మహారాష్ట్రలోనే చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 547 మంది కరోనా రోగులు మృత్యువాతపడగా, వీరిలో 122 మంది మహారాష్ట్రలోనే చనిపోయారు. దిల్లీలో 104 మంది, పశ్చిమ బెంగాల్‌లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో లక్షా 28వేల మంది మరణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని