రాయ్‌గఢ్‌ ఘటనలో మరొకరి మృతి

తాజా వార్తలు

Published : 25/08/2020 10:59 IST

రాయ్‌గఢ్‌ ఘటనలో మరొకరి మృతి

కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబయి: రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మరో 18 మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 75 మంది భవనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్పటి నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడాయి. కూలిన పదేళ్లనాటి ఆ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్లు నివాసితులు తెలిపారు. ‘సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. ఇంకో 18 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది’ అని రాయ్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి పేర్కొన్నారు. మహారాష్ట్ర మంత్రులు అదితి ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిండే ఘటనా స్థలాన్ని సందర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని