కాలుష్య నియంత్రణకు ‘స్మాగ్‌ టవర్‌’ 

తాజా వార్తలు

Published : 09/10/2020 22:40 IST

కాలుష్య నియంత్రణకు ‘స్మాగ్‌ టవర్‌’ 

దిల్లీ : కాలుష్య నియంత్రణ కోసం వివిధ రకాల చర్యలు చేపడుతోంది దిల్లీ ప్రభుత్వం. ఇటీవలే సచివాలయం వద్ద గ్రీన్‌ వార్‌ రూమ్‌ ప్రారంభించిన దిల్లీ సర్కార్‌ తాజాగా స్మాగ్‌ టవర్‌ ఏర్పాటు, ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అమలుకు సిద్ధం అవుతోంది. వీటికి శుక్రవారం దిల్లీ కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ విషయాల గురించి ఆన్‌లైన్‌ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాలుష్య నియంత్రణ కోసం దిల్లీలోని కన్నాట్‌ వద్ద స్మాగ్‌ టవర్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం రూ.20 కోట్లు కేటాయించాం. 10 నెలల్లో ఈ టవర్‌ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో ఇదే మొదటిది. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పాలసీ ప్రకారం...ఇది వరకు చెట్ల మనుగడను ప్రభావితం చేసిన సంస్థలే 80 శాతం ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీ కోసం ఒక సెల్‌ ఏర్పాటు చేస్తాం ’’ అని కేజ్రీవాల్ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని