డీజిల్‌పై వ్యాట్‌ను భారీగా తగ్గించిన దిల్లీ!

తాజా వార్తలు

Published : 31/07/2020 02:15 IST

డీజిల్‌పై వ్యాట్‌ను భారీగా తగ్గించిన దిల్లీ!

30శాతం నుంచి 16.75శాతానికి తగ్గింపు
దీంతో ఒకేసారి రూ.8 తగ్గిన డీజిల్ ధర

దిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా డీజిల్‌ ధరలో రికార్డుస్థాయి పెరుగుదల కనిపించింది. ఈ సమయంలో దిల్లీవాసులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకుంది. డీజిల్‌పై విధిస్తోన్న సుంకాన్ని భారీగా తగ్గించాలని దిల్లీ కేబినెట్‌ నిర్ణయించింది. ప్రస్తుతం డీజిల్‌పై ఉన్న 30శాతం వ్యాట్‌ను 16.75శాతానికి తగ్గించేందుకు కేబినెట్‌ నిర్ణయించినట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీంతో డీజిల్‌ ధర దాదాపు రూ.8.36పైసలు తగ్గనుంది. ప్రస్తుతం దిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.82ఉండగా తాజా నిర్ణయంతో అది రూ.73.64 పైసలకు తగ్గనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని