26 ఏళ్లలో తొలిసారి దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

తాజా వార్తలు

Published : 29/10/2020 19:16 IST

26 ఏళ్లలో తొలిసారి దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో వణుకుతున్న దిల్లీ ప్రజలను చలి మరింత బెంబేలెత్తిస్తోంది. దిల్లీలో గురువారం రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 26 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు తొలిసారి 12.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దిల్లీలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేవని తెలిపింది. అయితే, 1994 అక్టోబర్‌ 31న తొలిసారి అత్యంత కనిష్ఠంగా 12.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారి కుల్దీప్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, అంతకుముందు 1937 అక్టోబర్‌ 31న దిల్లీలో 9.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆల్ టైం రికార్డు అని తెలిపారు. చల్లగా వీచే గాలులతో పొగమంచు ఏర్పడటం కూడా ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆకాశం మేఘావృతం కాకపోవడం వల్ల ఈసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వడానికి ప్రధాన కారణమని భారత వాతావరణ శాఖ సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. నవంబర్‌ 1 నాటికి దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని