బలగాల ఉపసంహరణ పూర్తయింది: చైనా

తాజా వార్తలు

Published : 28/07/2020 17:54 IST

బలగాల ఉపసంహరణ పూర్తయింది: చైనా

బీజింగ్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా పేర్కొంది. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వెల్లడించారు. త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. ‘‘ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరు దేశాలకు చెందిన ముందు వరుసలో ఉండే సైనిక బలగాలను గల్వాన్‌ లోయ, హాట్ స్పింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఉపసంహరించడం జరింగింది. మరోసారి కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలకు సిద్ధమవుతున్నాం’’ అని తెలిపారు.

జూన్‌ 15 ఘటన తర్వాత ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్-చైనాలు పలుమార్లు దౌత్య, సైనికపరమైన చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు బలగాల ఉపసంహరణను ప్రారంభించాయి. అయితే చైనా తీరుతో భారత్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఆలోచన ఊపందుకుంది. ఇప్పటికే భారత్ ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని