close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120071661 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 3XEe_5TnXYY [video_short_link] => 3XEe_5TnXYY [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-06-04 07:58:32.445701 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 04/06/2020 07:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేరళ ఏనుగు మృతి: ఎఫ్‌ఐఆర్‌ నమోదు

తిరువనంతపురం: కేరళలో పేలుడు పదార్థాలు నింపిన పండు తినడం వల్ల ఏనుగు మృత్యువాతపడ్డ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. దీనిపై అటవీశాఖ అధికారులతో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఈ ఘటనకు సబంధించి స్థానిక పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారని మల్లప్పురం అటవీశాఖ అధికారి తెలిపారు.  

కొద్ది రోజుల క్రితం కేరళలోని మలప్పురం జిల్లాలోని సైలెంట్ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోకి గర్భంతో ఉన్న ఒక ఆడ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. అయితే అక్కడి గ్రామస్థులు దానికి పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను అందించారు. దాన్ని తిన్న ఏనుగు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రముఖలు సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేశారు.  



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.