కేరళ సచివాలయంలో అగ్ని ప్రమాదం

తాజా వార్తలు

Published : 26/08/2020 01:33 IST

కేరళ సచివాలయంలో అగ్ని ప్రమాదం

తిరువనంతపురం: కేరళ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొన్ని ముఖ్యమైన పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సెక్రటేరియట్‌ రెండో అంతస్తులోని జనరల్‌ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్‌ సెక్షన్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపుచేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు. కానీ, అప్పటికే కొన్ని కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరోవైపు ఈ ఘటనపై విపక్షాలు మండిపడ్డాయి. బంగారు ఆభరణాల చోరీ కేసుతో సంబంధమున్న పత్రాలను నాశనం చేసేందుకు ప్రభుత్వమే ఈ నాటకం ఆడిందని విమర్శలు గుప్పించాయి. బంగారం చోరీ కేసు అంశం ప్రసుత్తం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయ పరిశీలనలో ఉంది. ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని జేడీయూ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో సెక్రటేరియట్‌ ఎదుట ధర్నాకు దిగిన భాజపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని