వాళ్లకు ఉచిత మాస్క్‌.. ₹ 200 జరిమానా

తాజా వార్తలు

Updated : 30/11/2020 15:47 IST

వాళ్లకు ఉచిత మాస్క్‌.. ₹ 200 జరిమానా

బీఎంసీ నిర్ణయం‌

ముంబయి: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకొంటున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రజల్లో చైతన్యం మరింతగా పెంచేందుకు తాజాగా మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎవరైనా మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే వారికి ఉచితంగా మాస్క్‌ ఇవ్వడంతో పాటు రూ.200 జరిమానా విధించనున్నారు. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిధిలో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ 28 వరకు 4.85లక్షల మంది మాస్క్‌లు ధరించలేదని, వారి నుంచి రూ. 10.7 కోట్లు జరిమానా వసూలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారు జరిమానా కట్టి మాస్క్‌ లేకుండా ముందుకెళ్తే కొవిడ్‌ నియంత్రణ ప్రొటోకాల్‌ లక్ష్యం నెరవేరినట్టు కాదని భావిస్తున్నట్టు చెప్పారు. అందుకే, మాస్క్‌లేకుండా బయట తిరిగిన వారిని గుర్తించి వారికి ఉచితంగా మాస్క్‌ ఇవ్వడంతో పాటు రూ.200 జరిమానా విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  ముంబయి మహా నగరంలో ఆదివారం వరకు 2,82,821 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి బారిన పడి 10,865 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని