లక్ష టన్నుల ఉల్లి సరఫరా: తోమర్‌

తాజా వార్తలు

Published : 29/10/2020 18:10 IST

లక్ష టన్నుల ఉల్లి సరఫరా: తోమర్‌

దిల్లీ: ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. లక్ష టన్నుల ఉల్లిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే విదేశాలకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించామని, ఇతర దేశాల నుంచి మరింత ఉల్లిని దిగుమతి చేసేందుకు మార్గాలు సుగమం చేశామని అన్నారు. నవంబరు 3న మధ్యప్రదేశ్‌లోని 28 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి తులసీరామ్‌ శిలావత్‌కు మద్దతుగా తోమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు.

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్‌ వ్యతిరేకించడంపై తోమర్‌ మండిపడ్డారు. ఆ పార్టీ రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోందని విమర్శించారు. ‘‘2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ట్రేడ్‌ ఫ్రీ రెగ్యులేషన్స్‌ (నిబంధనలు లేని వ్యాపారం)కి పెద్ద పీట వేస్తామని, అంతర్రాష్ట్ర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తామని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొంటూ కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి ప్రోత్సాహమిచ్చే దిశగా చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు భాజపా ప్రభుత్వం అదేపని చేస్తే ఓర్వలేకపోతోందని విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని