టాంజానియాలో భారీ భూకంపం!

తాజా వార్తలు

Published : 13/08/2020 12:43 IST

టాంజానియాలో భారీ భూకంపం!

దార్‌ ఎస్‌ సలామ్‌: టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దార్‌ ఎస్‌ సలామ్‌కి 80కి.మీ దూరంలో కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో దాదాపు 8నుంచి 10సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. ముప్పై నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడంతో టాంజానియా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రభావం సమీప దీవుల్లోని మఫియా, జాంజీబర్‌, మొంబాసా, కెన్యా దీవుల్లో కూడా ఉన్నట్లు గుర్తించారు. పలుచోట్ల ఆస్తులు ధ్వంసం అయినప్పటికీ, ఇప్పటివరకు ప్రాణాపాయ వివరాలు నమోదుకాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని