close

తాజా వార్తలు

Updated : 30/09/2020 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్యంగానే ఉన్నా.. అందరికీ థాంక్స్‌: వెంకయ్య 

దిల్లీ: తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనా వైరస్‌ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. నిన్న ఆయన కరోనా బారిన పడటంతో ప్రస్తుత ఆరోగ్యంపై ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా  త్వరగా కోలుకోవాలంటూ కాంక్షించిన అందరికీ వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వెంకయ్యకు కరోనా సోకిందనే విషయం తెలియగానే దేశవ్యాప్తంగా ఆయన శ్రేయోభిలాషులు, పార్టీల నేతలు స్పందించారు. త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపిన విషయం తెలిసిందే. అలాగే, మాల్దీవుల ఉపరాష్ట్రపతి ఫైజల్‌ నసీం కూడా ఆందోళన వ్యక్తంచేశారు. వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. అందుకు ఆయనకు ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు ఆయన కార్యాలయం నిన్న రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నారని ట్విటర్‌లో తెలిపింది. ఉదయం రొటీన్‌గా కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని, లక్షణాలేమీ లేవంది. వైద్యుల సూచనలతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఆయన సతీమణి ఉషా నాయుడుకు నెగెటివ్‌ రావడంతో ఆమె ఐసొలేషన్‌లో ఉన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.