గుజరాత్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 31/08/2020 13:46 IST

గుజరాత్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

అహ్మదాబాద్‌: పాకిస్థాన్‌ గూడచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్‌ని గుజరాత్‌లో అరెస్ట్‌ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా  రేవులో నిందితుడు రాజాకభాయ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ కేసు విచారణలో లభించిన ఆధారాలతో ఎన్‌ఐఏ నేడు అతడిని అదుపులోకి తీసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు చిక్కిన నిందితుడు ఎం.డి.రషీద్ పాకిస్థాన్‌కు చెందిన రక్షణ, ఐఎస్ఐ అధికారులకు దేశ భద్రతకు సంబంధించిన సమాచారం చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడి అధికారులతో భేటీ కూడా అయినట్లు వెల్లడైంది. భద్రతా బలగాల కదలికలు, రక్షణశాఖ ప్రదేశాల సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఇదే విచారణలో గుజరాత్‌కు చెందిన రాజాకాభియా కుంభర్ ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు తేలింది. ఐఎస్ఐ ఆదేశాల మేరకు అతడు రూ.50 వేల పేటిఎం ద్వారా పంపినట్లు తెలిసింది. ఈనెల 27న రాజాకభాయ్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి..

మరోసారి రెచ్చగొట్టిన చైనా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని